కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగపూర్ లోని ఆయన కార్యాలయానికి దావూద్ పేరుతో శనివారం ఉదయం రెండుసార్లు కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. రూ.100 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి కార్యాలయానికి భద్రత పెంచారు.