ఎమ్మిగనూరు పట్టణంలోని బుధవారం ఉదయం 10: 30 గంటలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని హెచ్బిఎస్ కాలనీ నందుగల కోట్ల క్యాంపు కార్యాలయం లో నిర్వహిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం మండలాలు మరియు ఎమ్మిగనూరు పట్టణం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ & ఎన్. బి. కె అభిమానులు అందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa