అయినవిల్లి మండలంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని విశాఖపట్నం ఎడిషనల్ జిల్లా జడ్జ్ నందివాడ పద్మావతి ఆదివారం దర్శించుకున్నారు. తొలుత ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేసారు. అనంతరం ఆలయ చైర్మన్ నంబూరి వెంకటరమణ రాజు ఆమెకు శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa