గుత్తి మండలంలోని ధర్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ హై టెన్షన్ తీగలు తెగి కిందపడ్డాయి. దీంతో అక్కడ ఎలాంటి కట్టడాలు, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొ రేషన్ లిమిటెడ్ చెందిన ఇతర ప్రాంతాలకు సరఫరాఅయ్యే విద్యుత్తు భారీ స్తంభాలకు సంబం ధించిన హై టెన్షన్ తీగలు ఉన్న ఫలంగా తెగి కింద పడ్డాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీగలు కింద పడటంతో గడ్డకి నిప్పు అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు సమాచారం మేరకు ఎన్టీపీసీ అధికా రులు తెగిపడిన విద్యుత్తు తీగలకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు.