వైసిపికి వచ్చిన ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారంటూ మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గం మండల పరిధిలోని యర్రంపల్లి గ్రామంలో సోమవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరన్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ సీఎం వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేశారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.