నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలోని వెంపెంట గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహన్ని మాల మహానాడు ఏపి స్మశాన కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రాజకుమార్ సోమవారం సందర్శించారు. నేడు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహము పనులలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. గ్రామంలో స్మశాన స్థలం విషయమై గ్రామంలోని ఎస్సీల జనాభా లెక్కల ప్రకారం స్మశాన స్థలానికి కేటాయించాలని ఆర్డిఓను, ఎమ్మార్వోను కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఏపీ స్మశాన కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రాజకుమార్, జిల్లా నాయకుడు నల్లమల్ల అబ్రహం, నందికొట్కూరు నియోజకవర్గ అధ్యక్షులు సైనిక్ దళ్ సగినేల సురేష్, న్యాయవాది వాడాల రవికుమార్, గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.