పత్తికొండ : కర్నూల్ పార్లమెంటరీ బిసి విద్యార్థి సంఘం జాతీయ నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో కర్నూల్ పార్లమెంటరీ పార్టీ బిసి నాయకులు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో ఆయన నివాసంలో 16వ తేదీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించినట్లు రామకృష్ణ తెలియజేశారు.కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంటరీ కన్వీనర్ కురువ వెంకటరాముడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ బండారి శ్రీనివాసులు, కురువ యువజన సంఘం నాయకులు నల్లన్న, రాజు పాల్గొన్నారు.