ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 08:08 PM

జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న 1, 80, 000ను 5 లక్షలకు పెంచాలని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం గణేష్ కూడలిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పోరుబాట లో భాగంగా గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న కాలనీలో పేరుతో నిర్మిస్తున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు 1, 80, 000 ఏమాత్రం సరిపోదని, లబ్ధిదారులు అప్పులు చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టిటికో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. పట్టణాలలో ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రతి పేదవాడికి రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 22 వరకు సంతకాల సేకరణ చేపడతామన్నారు. ఫిబ్రవరి 6న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామన్నారు. ఫిబ్రవరి 22న విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహా ధర్నా కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బయన్న, మహిళా సమైక్య సభ్యురాలు జయలక్ష్మి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com