కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు రెవిన్యూ కాలనీ, 8వ వార్డు గుండ్లప్ప దొడ్డి వీధి, 9వ వార్డులలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయన వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని మనం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉండాలని ఈ ప్రభుత్వంలో మనం వినాశనం అయ్యమని తిరిగి చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు, అని తెలియజేస్తూ వార్డులో తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ కు పట్టిన ఖర్మ తొలగాలంటే చంద్రబాబునాయుడు ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.