2015-16 సబ్ ఇన్‌స్పెక్టర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించి 20 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలిపారు.మా ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉందని, రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలను ఏమాత్రం సహించేది లేదని ఆయన తెలిపారు.దేశంలోనే ‘కఠినమైన’ చీటింగ్ నిరోధక చట్టం రాష్ట్రంలో అమల్లోకి వస్తుందని చెప్పారు.త్వరలో దేశంలో అత్యంత కఠినమైన యాంటీ చీటింగ్ చట్టం అమలులోకి వస్తుందని, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.