హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. బాద్‌షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పిల్లాడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన బాలుడు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆ పిల్లాడిని బెదిరించాడు. అయితే, ఆ బాలుడు ఆదివారం తన తండ్రికి ఈ విషయాన్ని వివరించగా, అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa