ఝార్ఖండ్‌లోని పలమూ జిల్లాలో దారుణం జరిగింది. సోనూ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వినయ్ గుప్తాకు చెందిన మద్యం దుకాణానికి వచ్చాడు. అనంతరం వారంతా మద్యం కొన్నారు. బాటిల్‌పై అదనంగా పది రూపాయలు ఇవ్వాల్సిందిగా వినయ్‌తోపాటు అతడి సోదరులు డిమాండ్ చేశారు. దీంతో గొడవకి దిగిన సోనూ, ఆగ్రహంతో వారిపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.