అమెరికాలో కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం రేపాయి. గోషెన్ నగరంలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. దుండగులు ఆ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. మృతిచెందిన వారిలో 17 ఏళ్ల తల్లి, ఆమె 6 నెలల పాపతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఈ విషయాన్ని తులారే కౌంటీ షెరీఫ్ మైక్ బౌడ్రియాక్స్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa