రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతాయి. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంటాయి. మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన వారు రోజుకు కనీసం 6వేల అడుగులు వేయడం మంచిది.