ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా ఆరో విడతలో 4,90,376 మందికి మళ్లీ రుణాలు ఇప్పించేందుకు సంకల్పించింది. ఈ మేరకు బుధవారం నుంచి ఈ నెల 21 వరకు మండల, మునిసిపాలిటీల వారీగా బ్యాంకర్లు, లబ్ధిదారుల సమావేశాలు నిర్వహించనుంది. ఆరో విడత రుణ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa