కేంద్రమంత్రి అశ్వినీ చౌబే తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. బీజేపీ కిసాన్ మోర్చా నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పరుశురామ్ చతుర్వేది బిహార్‌లో గుండెపోటుతో మరణించారు. వణికించే చలిలో కూడా రైతు సమస్యలపై జరుపుతోన్న నిరాహారదీక్షలో తనతో పాటు పరుశురామ్ పాల్గొనే వారని గుర్తుచేసుకుంటూ మీడియా ముందే బోరున ఏడ్చేశారు. అనంతరం బక్సర్‌లో తనపై 2సార్లు దాడికి యత్నాలు జరిగాయని ఆరోపించారు.