గడిచిన 60 ఏళ్లతో పోలిస్తే గతేడాది చైనాలో జనాభా గణనీయంగా తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గినట్లు అంచనాకు వచ్చారు. గత ఏడాది చైనాలో సుమారు 95 లక్షల మంది జన్మించగా, కోటి 4 లక్షలు మరణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే గతేడాది జనాభా 8,50,000 తగ్గినట్లు తేల్చారు.