గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్రాంత ఎంఈఓ విశేషిరెడ్డి మాట్లాడుతూ రాయలు 1509లో విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించారని వివరించారు. వీరు తెలుగులో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించి" దేశభాషలందు తెలుగు లెస్స" అని ప్రపంచానికి చాటారని కొని యాడారు. ఈ సందర్భంగా నాదస్వర, డోలు కళాకారులు పొనుగుపాటి శ్రీరాములు, వుంగుటురు సత్యమునకు సాయిబాబా సేవాకమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కే. లింగమ్మ, పొనుగుపాటి రాధా, వూటుకూరు యజ్ఞ కృష్ణ, మీనుగు ఆకాష్ , ఇలా సాగరపు శ్రీరామ్, బొంత వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.