ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. శనివారం ఉక్రెయిన్ లోని డ్నిపో ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ పై రష్యా మిసైల్ తో దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. అయితే ఆ దాడిలో మరణించిన ఓ చిన్నారి, దాడికి కొన్ని క్షణాల ముందు ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. కానీ కేక్ కట్ చేసిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. ఈ బర్త్ డే వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.