పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసోలో 50 మంది మహిళలను ఇస్లామిక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆహారం కోసం అడవిలో పండ్లు ఏరుకునే క్రమంలో ఉన్న మహిళలను ఎత్తుకెళ్లారు. వారిని గుర్తించి, విడిపించేందుకు అక్కడి అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. బిర్కినాఫాసో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తిరుగుబాటుతో చాలారోజులుగా అంశాంతిని ఎదుర్కొంటోంది. అయితే మహిళలను ఎత్తుకెళ్లటం మాత్రం ఇదే తొలిసారి.