దేశంలో గత 24 గంటల్లో 1.63 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా, 89 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ సంఖ్య మూడేళ్ల కనిష్టం కావడం గమనార్హం. మార్చి 27, 2020 తర్వాత ఒక రోజులో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 2,035 యాక్టివ్ కేసులున్నాయని, 3 రోజులుగా ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.80 శాతానికి చేరిందన్నారు.