ఉమ్మడి గుంటూరు జిల్లాలో, నిధులు లేక నిలిచిపోతున్న పనులు, సిమెంట్ ఉంటే ఇసుక, ఇసుక ఉంటే ఇనుము సరఫరా లేక ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న రెండో విడత నాడు-నేడు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. మంగళవారం నిధుల లేమి తో చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. రెండో విడతలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 825 స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. వాటిల్లో 500కు పైగా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఉన్నాయి.