రాజస్థాన్ లో నమోదవుతున్న అత్యాచార కేసుల్లో 41 శాతం కేసులు తప్పుడు కేసులేనని ఆ రాష్ట్ర డీజీపీ ఉమేష్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. 2019 జూన్ లో ప్రవేశపెట్టిన ‘నిరంతర నమోదు’ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో భారీగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయన్నారు.