పరవాడ, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను పరవాడలో టీడీపీ శ్రేణులు బుదవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సంత బయలు వద్దనున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, మాజీ జెడ్పిటిసి పైల జగన్నాధరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న, నాయకులు అట్టా సన్యాసిఅప్పారావు, పైల వరలక్ష్మి, వర్రి పరదేసినాయుడు, నగిరెడ్డి చిన్నారావు, గొంప మారునాయుడు, కరణం అప్పారావు, పైలచిన అక్కు నాయుడు, జాజుల చిన్నారావు, పైల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.