నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ను మంగళవారం బిజెపి పొలిటికల్ ఫీడ్ బ్యాక్ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాజంపేట పార్లమెంటు ఇంచార్జి సాయిలోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి పుస్తకాన్ని బహూకరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా సాయి లోకేష్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ గా ఎఫ్. ఏ ఖాన్ సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్, మాజీ సర్పంచ్ తోట రామయ్య తదితరులు పాల్గొన్నారు.