దేశంలో ధనికులు, పేదల మధ్య ఆర్థిక అసమానతలకు బీజేపీ విధానాలే కారణమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. దేశంలో 21 మంది ధనవంతుల వద్ద సంపద.. 70 కోట్ల మంది ప్రజల వద్ద సంపదతో సమానమని చెప్పారు. ఈ అగాథం పూడ్చేందుకే రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో పేదరికం నుంచి బయటపడ్డ 20 కోట్ల మంది బీజేపీ విధానాలతో తిరిగి పేదరికంలోకి వెళ్తున్నారన్నారు.