శృంగవరపుకోట మండలం, శృంగవరపుకోట పట్టణ గ్రామంలో దేవి కూడలి వద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి యన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తి కిరీటం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
అదేవిధంగా తెలుగు భాష, సినిమా, కళలు, రాజకీయాలు, సాహిత్య రంగాల వికాసానికి ఎనలేని కృషిచేసి మహానాయకులు ఎన్టీఆర్ అని తెలియజేశారు. అనంతమైన ప్రజాభిమానం, అనితరసాధ్యమైన విజయాలు ఎన్టీఆర్ కృషికి, పట్టుదలకు తార్కాణాలు. రాజకీయాల్లో మహిళల, బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనందరం కలిసికట్టుగా కృషిచేద్దామని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జి. ఎస్. నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, వైస్ ఎంపీపీ నానిగిరి రమనాజి, శృంగవరపుకోట గ్రామ పార్టీ అధ్యక్షులు కె. మల్లీశ్వరరావు, విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కాపుగంటి శ్రీనివాసు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కిరణ్‌కుమార్, ఐటీడీపీ నియోజకవర్గం కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య, బీసీ సెల్ ఉపాధక్షులు కనిశెట్టి ఈశ్వరావు, నియోజకవర్గం తెలుగు యువత అద్యక్షులు వాకాడ బాలు, అనిల్, పుణ్యగిరి మాజీ ఎంపీటీసీ కన్నతల్లి, ధర్మవరం సర్పంచ్ గాలి సన్యాసి, టీడీపీ సీనియర్ నాయకులు వసంత సత్యారావు, మోపాడ చిన్ని కృష్ణ, పొట్నూరు అప్పలరాజు (సాయిరాం), సరిపల్లి రామకృష్ణ, పెదగాడ రాజు, బ్రహ్మాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుకూరి శ్రీనురాజు, పార్టీ కార్యకర్తలు, ఐటీడీపీ, టి. ఎన్. ఎస్. ఎఫ్, టి. ఎన్. టి. యు, తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఎన్. టి. ఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, మహిళలు, తదితరులు