బీహార్ లో పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణీకి హిజ్రాలు డెలివరీ చేసి ఆమె పాలిట దేవుళ్లయ్యారు. జనశతాబ్దిలో సోమవారం ఓ గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. సహాయం చెయ్యాలని ఆమె భర్త అక్కడున్న మహిళలను వేడుకున్నా ఓ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో కొందరు హిజ్రాలు గర్భిణీని వాష్ రూంలోకి తీసుకెళ్లి సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం ఆర్థిక సాయం చేసి వెళ్లిపోయారు.