ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి ఫ్రాన్స్ టౌలాన్ లోని తన నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆండ్రీ ప్రతినిధి డేవిడ్ తవెల్లా వెల్లడించారు. లూసిల్ రాండన్ 1904, ఫిబ్రవరి 11న జన్మించారు. 1944లో సిస్టర్ ఆండ్రీగా మారారు. కొవిడ్-19 నుంచి బయటపడిన అత్యంత ఆమె వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.