వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం జగన్ బుధవారం సమీక్షించారు. ఫిబ్రవరి 20 నుంచి రబీకి సంబంధించిన ఈ-క్రాప్ బుకింగ్ ప్రారంభిస్తామని, మార్చి మొదటి వారంలో తుది జాబితాను వెల్లడిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. రబీలో కూడా విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మండు తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.