ప్రధాని మోదీ గురువారం ఉదయం కర్ణాటకలోని యాదగిరి, కలబురగి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన యాదగిరి జిల్లాలోని కొడెకలో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం యాదగిరి జిల్లా కోడెకల్‌లో జల్ జీవన్ మిషన్ కింద యాదగిరి బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈ పథకం కింద 117 ఎంఎల్‌డి నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ₹ 2,050 కోట్లకు పైగా ఖర్చు చేసే ఈ ప్రాజెక్ట్, యాదగిరి జిల్లాలోని 700 కంటే ఎక్కువ గ్రామీణ ఆవాసాలు, మూడు పట్టణాలకు చెందిన 2.3 లక్షల ఇళ్లకు తాగునీరు అందించనుంది. ఆపై నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ – ఎక్స్‌టెన్షన్ రినోవేషన్ అండ్ మోడరనైజేషన్ ప్రాజెక్ట్ (NLBC-ERM)ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. 10,000 క్యూసెక్కుల కాలువ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించవచ్చు. కలబుర్గి, యాదగిరి, విజయపూర్ జిల్లాల్లోని 560 గ్రామాల్లోని మూడు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ₹ 4,700 కోట్లు అని ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఇక మధ్యాహ్నం మోదీ కలబురగి జిల్లా మల్ఖేడ్ గ్రామానికి చేరుకుని అక్కడ కొత్తగా ప్రకటించిన ఈరెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన NH-150Cలోని 71 కి.మీ సెక్షన్‌కు కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్ సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వేలో భాగం. 2,100 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల(6) గుండా వెళుతుంది. . ప్రస్తుతం ఉన్న 1,600 కి.మీ దూర మార్గాన్ని 1,270 కి.మీలకు తగ్గించనుంది.
ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటన సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. కర్ణాటకలో పర్యటన ముగిసిన అనంతరం మోదీ మరాఠీల రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో దాదాపు ₹ 38,800 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు . ముంబై మెట్రోలో రెండు లైన్లను ఆయన ప్రారంభించడమే కాక మెట్రో రైడ్ కూడా చేస్తారు. ఇది అర్బన్ మొబిలిటీని పెంచడానికి సుమారు ₹ 12,600 కోట్ల విలువైన ముంబై మెట్రో రైల్ లైన్స్ 2A, 7ని దేశానికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. దహిసర్ E- DN నగర్(పసుపు లైన్)లను కలిపే మెట్రో లైన్ 2A సుమారు 18.6 కి.మీ పొడవు ఉండగా, అంధేరీ E – దహిసర్ E (రెడ్ లైన్)లను కలిపే మెట్రో లైన్ 7 సుమారు 16.5 కి.మీ పొడవు ఉంది. 2015లోనే ఈ లైన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
అనంతరం మోదీ ముంబై 1 మొబైల్ యాప్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ముంబై 1)ని కూడా ప్రారంభించనున్నారు. ఈ యాప్ మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్స్‌ను, టికెట్ కొనుగోలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుకు సహాయపడి ప్రయాణ సౌలభ్యాన్ని సులభతరం చేస్తుంది. ఆపై సుమారు రూ. 17,200 కోట్లతో నిర్మించనున్న ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. మహారాష్ట్రలో తన పర్యటన ముగింపు దశలో భాగంగా హిందూహృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా హాస్పిటల్‌ను కూడా ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, మందులు, పరిశోధనలు, రోగనిర్ధారణ వంటి అవసరమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది ఈ హాస్పిటల్ . చివరిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa