పంజాబ్ లో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆయనకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, పార్టీలో నెలకొన్న ఘర్షణ వాతావరణంలో తాను పనిచేయలేకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపారు.