భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి తగవు కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సాలూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు పట్టణం స్థానిక మహంతి వీధికి చెందిన వాడపల్లి సురేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఇతడికి మద్యం సేవించే అలవాటు ఉండటంతో బుధవారం మధ్యాహ్నం సురేష్ భార్య మద్యం మానేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో మనస్థాపానికి గురైన సురేష్ తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సాలూరు సబ్ ఇన్స్పెక్టర్ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.