ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు రెండు వేల డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా తొలి విడత కింద 500 డ్రోన్లను పంపిణీ చేస్తామని సీఎంకు వివరించారు. వీటి వినియోగంపై గత డిసెంబరులో శిక్షణ మొదలైందని, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింతగా ఉధృతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.