రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, ఇతరత్రా హామీలను ఎన్నికల వేళ ప్రధానంగా ప్రస్తావించే బీజేపీ ఆ తర్వాత మరోలా మాట్లాడుతుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మేఘాలయ ఉత్తర గారో హిల్స్ లో బుధవారం ఆమె భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘బీజేపీకి 2 ముఖాలుంటాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు దక్కుతాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.