జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామ్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల గిరిజన బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఈ నెల14న సమీప గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.