ఏపీ ప్రజలకు త్వరలో షాక్ తగలనుంది. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి నుండి విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో నేటి నుండి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్చ్యువల్ పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అభ్యంతరాలున్న వారు తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.