ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గురువారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని, సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో అయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంభీరమైన భావాల్ని సరళమైన భాషలో అక్షరీకరించి పద్యములు రాసినా అలతి అలతి పదాలతో ఆట వెలుదులు రాసినా పామరులకు సైతం అర్ధమయ్యేలా
ఆనాటి సామాజిక రుగ్మతలపై అక్షరాస్త్రాలను సంధించిన సాహితీ సమరాంగణ ధీరుడు యోగి వేమన! పదిహేడవ శతాబ్దిలో ఉగాది పర్వదిన తిధుల్లో కొండవీటికి చెందిన మూగ చింతపల్లెలో జన్మించి దేశ సమాచారం గావించి ఆటవేలది లో అలవోకగా పద్యారచనలను గావించి ప్రజలను చైతన్య పరచిన ప్రజాకవి యోగి వేమన!
జీవన సత్యాలను తన రచనలలో వ్యక్తీకరించి వాటిని నిత్యసత్యాలుగా మార్చి తన జీవితానుభవ సారాన్ని రంగరించి వేమన శతక పద్యాలను రచించి ప్రపంచానికి అందించిన విశ్వకవి యోగి వేమన! గోల్కొండ నవాబుల ఆదిపత్యాన్ని ఎదిరించి కులమతాల కంచెలను తొలగించి మూఢ నమ్మకాల ఉచ్చులోంచ జనావళికి. మోక్షాన్ని ప్రసాదించిన అభ్యుదయ భావ కవి యోగి వేమన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యల్. లక్కీ రెడ్డి, బి. కోటేశ్వరరావు, కె. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.