నవంబర్ 24 వ తేదీన మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి పట్టాలు కావాలని అడిగిన 24 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లులేని వారికి ఇంటి పట్టాలను అందించామన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా కేవలం 90 రోజులలో ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు కావాలని అడిగిన పేదలకు కేవలం 60 రోజులలోనే ఇళ్లపట్టాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనడానికి నిదర్శనం సీఎం జగన్ ఏర్పాటు చేసిన సచివాలయం మరియు వాలంటరీ వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడికైనా ఇంటి స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 లక్షల మంది పేదవారికి సీఎం జగన్ ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన సచివాలయ, వాలంటరీ వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, వైస్ చైర్మన్ చాపల షరీఫ్, వైస్ ఎంపీపి ఊటుకూరు రఘురాం రెడ్డి, వైసీపీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.