ఎంఆర్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలువు మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కొరకు చొరవ తీసుకోవాలని గురువారం కడప నగరంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్య వర్గ సభ్యులు అరవేటి హరిక్రిష్ణ కు ఎమ్మార్పీఎస్, యంయస్పి, యంయస్ఎఫ్, ఎంఎంఎస్, విహెచ్ పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ. బీజేపీ అధికారంలోకి వచ్చిన100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని, అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణ అంశాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేయడం పట్ల మాదిగ జాతిని మోసం చేయడం లో భాగమేనని, మాదిగల ను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తుందని, బీజేపీ తమ వైఖరి మార్చుకొని యస్సీ వర్గీకరణకు చట్టబద్దత కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యంఆర్పియస్ జిల్లా కన్వీనర్ మాణికింది వెంకటేష్ మాదిగ, యంయస్పి జిల్లా నాయకులు జయచంద్ర, మాతయ్య, గంగరాజు మాదిగ, నరసింహులు , ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు విజయ రాణి, విహెచ్ పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు మాతయ్య, యంయస్ఎఫ్ కో కన్వీనర్ ఒంగలి ఓబులేసు, శివ తదితరులు పాల్గొన్నారు.