వై. ఎస్. ఆర్ జిల్లా ఎస్. పి అన్బురాజన్ ఆదేశాల మేరకు గురువారం కడప ట్రాఫిక్ ఎస్. ఐ లు శ్రీనివాసులు, సుబ్రమణ్యం, వెంకటయ్యల ఆధ్వర్యంలో '34 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు' సందర్బంగా ఐ. టి. ఐ సర్కిల్ సమీపంలోని సాయిబాబా విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహన దారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించారు. సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు రోడ్డు ప్రమాదాల వల్ల ఒక కుటుంబం ఆర్ధికంగా ఎంతో నష్టపోతుందని, కుటుంబ పెద్ద తీవ్రంగా గాయపడితే కుటుంబ సభ్యుల మనో వేదన లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదన్నారు. అందరూ తమ వంతు బాధ్యత గా రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు కృషి చేయాలని ట్రాఫిక్ ఎస్. ఐలు, సిబ్బంది విజ్ఞప్తి చేశారు.