టిబెట్ లోని నైరుతి ప్రాంతాన్ని మంచు ఉప్పెన ముంచెత్తింది. మెయిన్లింగ్ కౌంటీలోని పాయ్, డోక్సాంగ్ ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి మంచు ఉప్పెన కారణంగా 8 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఉప్పెనలో ప్రజలు, వాహనాలు చిక్కుకుపోయినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. 246 మంది సిబ్బంది ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa