టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 5వ ఫైనాన్స్ కమిషన్‌ను నియమించకుండా నిధులు మళ్లిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌ను త్వరలో నియమిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గత విచారణ సందర్భంగా 3 నెలల్లో ఫైనాన్స్ కమిషన్ నియమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 3 నెలలు గడుస్తున్నా కమిషన్ నియమించలేదని పిటిషనర్ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. ఫైనాన్స్ కమిషన్ నియామకానికి సంబంధించి.. ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. గవర్నర్ ఆమోదం వచ్చిన వెంటనే కమిషన్‌ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. 4 వారాలలోపు కమిషన్‌ను నియమించాలని హైకోర్టుకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.