ప్రకాశం జిల్లా, గిద్దలూరులో రాయల్ హైస్కూల్ బోర్డు తిప్పేసింది. స్కూల్ నిర్వహించలేమని యాజమాన్యం చేతులెత్తేసింది. రాయల్ స్కూల్లో ప్రస్తుతం 213 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూలు యాజమాన్యం బోర్డు తిప్పేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాయల్ స్కూల్‌ను రవికిరణ్ యాదవ్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. పాత యాజమాన్యంతో నగదు లావాదేవీల విషయంలో.. వివాదంతో స్కూల్ యాజమాన్యం బోర్డు తిప్పేసింది.