సీఎం జగన్ రైతు ద్రోహి అని.. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రతిధాన్యం గింజ కొంటానన్న జగన్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. 2020-21లో 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని, 2022-23లో 37 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేయడం రైతుల్ని నట్టేటముంచడమేనన్నారు. ప్రభుత్వం అన్నదాతలకు న్యాయం చేయకుంటే, ‘రైతు కోసం-తెలుగుదేశం’ తో జగన్ రెడ్డికి దిమ్మతిరిగేలా చేస్తామని నిమ్మల హెచ్చరించారు. రైతుల వద్ద ధాన్యం నిల్వలుంటే, ప్రభుత్వం అర్థంతరంగా కొనుగోళ్లు నిలిపేయడమేంటని రామానాయుడు ప్రశ్నించారు. యంత్రాల ద్వారా కోసే ధాన్యంలో తేమ ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. తేమ శాతం పేరుతో రైతులకు వ్యవసాయంపై విరక్తి పుట్టేలా చేస్తారా? అని నిమ్మల నిలదీశారు.