అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి ఓ హెడ్‌కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. సుమారు 70 ఏళ్ల వృద్ధుడు (సా ధువు) పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. ఎప్పటిలాగే శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం, దాసన్నపేట జంక్షన్ వద్ద ఓ బంగారు దుకాణం వరం డాపై మంగళవారం రాత్రి నిద్రించాడు. బుధవారం ఉదయం చూసేసరికి కింద పడిపోయి మృతి చెంది ఉన్నాడు. స్థాని కుల సమాచారంతో మునిసిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదే హాన్ని ఖననం చేసేందుకు సిద్ధమయ్యా రు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసు స్టేషన్ రైటర్ తెలుకుల రామారావు వెంటనే అక్కడకు చేరుకొని అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తానని చెప్పారు. సొంత ఖర్చులతో రిక్షా మీద మృతదే హాన్ని బాహుదా నదికి తీసుకెళ్లారు. శాస్త్రో క్తంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని ఖననం చేశారు. గత ఏడాది కూడా రెండు అనాథ శవాలకు రామా రావు సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపారు. కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ బచ్చు జగన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.