మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లో 14 మందికి కారుణ్య నియమాకాలు ద్వారా ఉద్యోగ పత్రాలను అందించినట్లు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు తెలిపారు. గురువారం జివిఎంసి ప్రధాన కార్యాలయం ఆయన ఛాంబర్ లో వివిధ కారణాలతో మరణించిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించామని వారిలో వర్క్ ఇన్స్పెక్టర్గా -4, సోషల్ వర్కర్-1, గ్రేడ్ టు ఫిట్టర్-3, ఆఫీస్ సబార్డినేటర్, మజ్దూర్లు-6 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న వారితో ఎంతో నిబద్ధతతో ఉద్యోగాలు చేయాలని, సమయపాలన, అధికారుల పట్ల విధేయత, ప్రజలకు మంచి చేయాలనే తపనతో పని చేయాలని ఈ సందర్భంగా వారికి కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వై. శ్రీనివాస రావు, ఎ. ఓ(అడ్మిన్) పద్మజ, పరిపాలనా విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.