ఓ యువతి దుప్పటిని పెళ్లి చేసుకున్న వైనం నెట్టింట వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ కు చెందిన పాస్కేల్ సెల్లిక్ అనే యువతి తాను ఇష్టంగా కొనుక్కున్న మెత్తటి దుప్పటిని పెళ్లి చేసుకోవడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నందునే ఆ దుప్పటిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లికి 150 మంది అతిథులను కూడా ఆహ్వానించింది. పాస్కేల్ తమ ప్రియుడి అంగీకారంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.