15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించి వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకూ ఈ నిబంధన వర్తించనుంది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సైన్యం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.