ఏపీ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అండగా ఉండేందుకు 'వైఎస్సార్ గీత కార్మిక భరోసా' పథకాన్ని ప్రకటించింది. చెట్టుపై నుంచి పడి మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం బారిన పడినా రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో కార్మికశాఖ రూ.5 లక్షలు, రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తాయి. దీనిపై గురువారం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది.